సీఎస్... చెవిరెడ్డి సెక్రటరీలా మారిపోయారు - tdp
చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ అక్రమాలపై తెదేపా అభ్యర్థి నాని ఫిర్యాదు చేస్తే కనీసం కన్నెత్తి చూడని ఈసీ.. చెవిరెడ్డి ఫిర్యాదుకు వెంటనే చర్యలు తీసుకుంది. భాజపాను అడ్డుపెట్టుకుని వైకాపా కుట్రలకు పాల్పడుతుంది అనే దానికి నిదర్శనం ఇదే: అనురాధ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) చెవిరెడ్డి సెక్రటరీగా మారారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ అక్రమాలపై ఎన్నికల సంఘానికి కాకుండా సీఎస్‌కు చెవిరెడ్డి ఫిర్యాదు చేయడం ఏంటని అమరావతిలోని మీడియా సమావేశంలో ఆమె ప్రశ్నించారు. ఆ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఫిర్యాదును పట్టించుకోకుండా... వైకాపా ఫిర్యాదుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ మహాత్ముడిపై భాజపా నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఆ పార్టీ అగ్రనేతలు, ఎన్నికల సంఘం స్పందించదా అని అనూరాధ నిలదీశారు.