ఇదీ చదవండి:
'సేవ్ అమరావతి సేవ్ ఏపీ' నినాదాలతో తెదేపా నేతల నిరసన - tdp leaders protest with slogans news
ఏపీ రాజధాని ఏది అని పక్క రాష్ట్రాల వాళ్లు అడిగితే మూడు రాజధానులని..సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల కేంద్రంలో తెదేపా బాధ్యులు హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నోటికి నల్ల రిబ్బన్ కట్టి మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజల్లో అయోమయం నెలకొందని వాపోయారు. రాష్ట్రానికి ఒకటే రాజధానిగా అమరావతిని ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సేవ్ అమరావతి సేవ్ ఏపీ, మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నాయకులు నినాదాలు చేశారు.
'సేవ్ అమరావతి సేవ్ ఏపీ' నినాదలతో తెదేపా నేతలు నిరసన