ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో నల్ల జెండాలతో ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు - మూడు రాజధానులకు వ్యతిరేకంగా తిరుపతిలో తెదేపా నేతల ఆందోళన

తిరుపతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో తెదేపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డగించటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంత మంది నిరసనకారులకు స్వల్ప గాయాలయ్యాయి.

tdp leaders arrest in thirupathi
తిరుపతిలో నల్ల జెండాలతో ర్యాలీ.. అడ్డగించిన పోలీసులు

By

Published : Jan 21, 2020, 10:17 PM IST

తిరుపతిలో నల్ల జెండాలతో ర్యాలీ.. అడ్డగించిన పోలీసులు

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతి నగరంలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులిపర్తి నాని ఇంటి నుంచి తణపల్లి జాతీయ రహదారి వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం.. ఓకే రాజధాని అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని... చంద్రగిరి పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ తోపులాటలో కొందరి కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతియుత నిరసన తెలుపుతున్న తమని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ అన్నారు. శాసనమండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నివిపివేశాలో.. ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details