తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వేగంగా వస్తున్న కారు తుమ్మలగుంట మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేష్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు తుమ్మలగుంటలోని ఎస్సీ కాలనీకి చెందిన జాల వెంకటేష్. ఈయన స్థానిక పంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్ ఎమ్మార్ పల్లె పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అతివేగం: బైక్‌ను ఢీకొన్న కారు.... ద్విచక్రవాహనదారుడు మృతి - Road accident news in Tirupati
తిరుపతి నుంచి వేగంగా వస్తున్న కారు... తుమ్మల గుంట వద్ద రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.
అతివేగం: బైక్‌ను ఢీకొన్న కారు.... ద్విచక్రవాహనదారుడు మృతి