ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 18, 2021, 8:47 PM IST

ETV Bharat / state

redsandal seized at chittor: రూ.1.5 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగల పట్టివేత

redsandal seized at chittor: చిత్తూరు జిల్లా నారాయణవనంలో.. రూ.1.5కోట్ల విలువగల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణవనం ఊత్తుకోట మార్గం మధ్యలో.. వాహనాలు తనీఖీలు చేస్తున్న సమయంలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

redsandal seized at narayanavanam in chittor district
రూ.1.5 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగల పట్టివేత


redsandal seized at chittor: చిత్తూరు జిల్లా నారాయణవనం పోలీసులు.. రూ.1.5 కోట్లు విలువగల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ ప్రియాంక తమ సిబ్బందితో నారాయణవనం ఊత్తుకోట మార్గ మధ్యలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా.. పాలమంగళం వద్ద అనుమానంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద ఉన్న బొలెరో వాహనంలో తనిఖీలు చేపట్టారు.

అందులో 20 ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా.. సదాశవకోనకు వెళ్లే దారిలో గల పందులయ్య కోనకొండపై స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కోనకొండపై ఉన్న 270 ఎర్రచందనం దుంగలు, 14 మంది స్మగ్లర్లను పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నాట్లు.. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details