ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Red Sandal: కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం - కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం వార్తలు

రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగులను తిరుపతి టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Red Sandal Smugglers Arrest at tirupathi
కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

By

Published : Jul 31, 2021, 9:31 PM IST

తిరుపతి టాస్క్​ఫోర్స్ పోలీసులు రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగులను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి - కడప రహదారిలోని కుక్కలదొడ్డి సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు స్మగ్లర్లు చిక్కారు. ప్రకాశం జిల్లాకు చెందిన స్మగ్లర్ రమేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా..కర్నూలు జిల్లాకు చెందిన మరో స్మగ్లర్ పుల్లారెడ్డితో కలిసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

తరలించడానికి సిద్దంగా ఉన్న 5 దుంగలతో పాటు అతడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలోని చిన్నారికట్లలో దాచిన 35 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ ఎస్పీ సుందరరావు తెలిపారు. పుల్లారెడ్డి పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details