తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమలేశుడు ఉదయం నుంచి రాత్రి వరకూ సప్త వాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకలు తిలకించేందుకు వచ్చిన భక్తులతో తిరు మాఢవీధులు పూర్తిగా నిండిపోయాయి. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు వేల మంది శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీరు, మజ్జిగను అందించారు. గ్యాలరీల వద్ద రద్దీని సీనియర్ అధికారులతో నిరంతరం పర్యవేక్షించారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి మాఢవీధుల్లోనే ఉంటూ అధికారులకు సూచనలు చేశారు. మూడు లక్షల మంది భక్తులు వాహన సేవల్లో పాల్గొన్నారని ఈవో తెలిపారు.
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు - latest news of radasapthami in thirumala
మాఘశుద్ధ సప్తమినాడు... సూర్యజయంతిని పురస్కరించుకుని శనివారం తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరీశుడు సప్తవాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహనసేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ జరిగాయి.
తిరుమలలో కన్నల పండగగా జరిగిన రథసప్తమి వేడుకలు