తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించేందుకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏడాది కార్తీకమాసం శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ... పుష్పయాగంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి నివేదించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 8 టన్నుల పూలను సేకరించారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక రాష్ట్రం నుంచి రెండు టన్నులు, ఇరు రాష్ట్రాల నుంచి ఒక టన్ను పూలను సేకరించారు. ఇందులో 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్ధనం వంటి సాంప్రదాయ కుసుమాలు ఉన్నాయి. సోమవారం ఉదయం గంపలలో శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా ఈ పూలను తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు 8 టన్నుల కుసుమాలతో పుష్ప కైంకర్యం చేయనున్నారు
తిరుమల శ్రీవారి ఆలయంలో... పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు
ప్రతి ఏడాది కార్తీకమాసం శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో... పుష్పయాగ మహోత్సవ ఏర్పాట్లు