చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా వైరస్‌పై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో సైరన్ మోగిస్తూ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఇంటి నుంచి బయటకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.. బయటికి రాకండి' - శ్రీకాళహస్తిలో కరోనా కేసులు
శ్రీకాళహస్తిలో కరోనా వ్యాప్తిపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వీధుల్లో వాహనాలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. ఎవరూ బయటికి రావొద్దని కోరుతున్నారు.
వాహనాలతో వీధుల్లో తిరుగుతూ కరోనాపై పోలీసులు అవగాహన