చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరులో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మునిరత్నం అనే వ్యక్తికి సుమతో పదేళ్ల క్రితం వివాహమైంది. అప్పుడప్పుడు భార్యతో గొడవపడేవాడని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. భర్త వేధిస్తున్నాడని ఇటీవల సుమ ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాజీ చేసి పంపారు. మళ్లీ.. మునిరత్నం భార్యతో గొడవపడగా.. బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన భార్య చుట్టుపక్కల వారికి చెప్పింది. పోలీసులు వచ్చి తలుపుల గడియపగలగొట్టి చూడగా.. మునిరత్నం గడియకు టవల్‌తో ఉరివేసుకొని చనిపోయినట్టు గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రకి తరలించారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య - కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. చిత్తూరు జిల్లాలో జరిగింది.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య