తిరుమల కొండపై శబ్ద కాలుష్యం నియంత్రించేందుకు పోలీసు శాఖ చర్యలు ప్రారభించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో నిత్యం వేదమంత్రోచ్ఛారణలు, గోవిందనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు గడుపుతుంటారు. అయితే వేలాది వాహనాలతో శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తిరుమల కొండను నో హారన్ జోన్ గా తీర్చి దిద్దేందుకు చర్యలు ప్రారంభించారు.తిరుమలకు వచ్చే భక్తులకు అవగాహన కల్పించటంతో పాటు... తిరుమల, తిరుపతి అద్దె వాహన దారులకు సూచనలు చేశారు.
'తిరుమల కొండను నో హారన్ జోన్‌గా తీర్చిదిద్దుతాం' - తిరుమల తాజా వార్తలు
తిరుమల కొండపై గోవిందనామస్మరణల మధ్య వాహనాలతో శబ్దకాలుష్యం లేకుండా పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తిరుమల కొండను నో హారన్ జోన్ గా తీర్చిదిద్దాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
no horn zone in thirumala hill in chittor dst thirupati