అరగంట పాటు తెరుచుకోని రైల్వే గేటు! - technical problem
సాంకేతిక సమస్యల కారణంతో నరసింగాపురం వద్దనున్న రైల్వే గేటు అరగంట పాటు తెరుచుకోలేదు. ఈ కారణంగా వాహనదారులు మండుటెండల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
'అరగంట పాటు తెరుచుకోని రైల్వే గేటు'
తిరుపతి మదనపల్లి జాతీయ రహదారి పక్కనున్న నరసింగాపురం వద్దనున్న రైల్వే గేటు తెరుచుకోని కారణంగా.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి - కాట్పాడి ప్యాసింజర్ రైలు కోసం గేటు వేసిన సిబ్బంది.. రైలు వెళ్లినా అరగంటపాటు గేటు తెరుచుకోలేదు. ఈ కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ద్వి చక్ర వాహనదారులు గేటు బలవంతంగా పైకి ఎత్తి వాహనాలను తీసుకెళ్లారు. అనంతరం రైల్వే గేటు సిబ్బంది గేటును మరమ్మతులు చేశారు.