ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టా భూములు ఇళ్ల స్థలాలకు ఎలా కేటాయిస్తారు..?' - చిత్తూరు జిల్లా

ఇళ్ల స్థలాల కేటాయింపును చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ముడిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ భూములు లాక్కొని స్థలాలు ఇస్తున్నారని ఆరోపించారు.

chittor district
పట్టాభూములు ఇళ్లస్థలాలకు ఎలా కేటాయిస్తారు

By

Published : Jul 5, 2020, 10:27 AM IST

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ముడిపల్లి గ్రామంలో అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. బలవంతంగా తమ భూములు లాక్కొని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం మంచిదేనని.. కానీ పేదవారైన తమ వద్ద నుంచి భూములు లాక్కోవడం సరికాదని వాపోయారు.

తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఎలా పనులు చేస్తారంటూ అధికారులపై ఆగ్రహించి.. జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ గ్రామస్థులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details