ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూతురికి పురుగుల మందు ఇచ్చి... తానూ తాగిన తల్లి

చిత్తూరు జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. ఇందులో ఇద్దరు మరణించగా, ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో ఒకరు మహిళ, మరొకరు ఎనిమిదో తరగతి విద్యార్థిని.

mother and daughter attempts suicide
mother and daughter attempts suicide

By

Published : Jan 12, 2021, 8:36 PM IST

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రపల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన సరస్వతికి దివ్యాంగురాలైన హేమలత అనే కూతురు ఉన్నారు. చిన్నతనం నుంచి కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటోంది తల్లి. ఏళ్లు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో సరస్వతి వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం తన కూతురు హేమలతకు పురుగుల మందు ఇచ్చి తాను కూడా తాగింది. ఈ సంఘటనలో కూతురు మరణించగా తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

మరోవైపు మదనపల్లి మండలం బసినికొండకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని షాహినా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !

ABOUT THE AUTHOR

...view details