ETV Bharat / state
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్ బాబు ధర్నా
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సినీనటుడు మోహన్‌బాబు ఆరోపించారు. తిరుపతి విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట ధర్నా చేసిన ఆయన... వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్ బాబు ధర్నా
By
Published : Mar 22, 2019, 12:34 PM IST
| Updated : Mar 22, 2019, 3:42 PM IST
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్ బాబు ధర్నా తిరుపతి విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట సినీనటుడు మోహన్‌బాబు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించట్లేదంటూ ఆరోపించారు. విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. రూ. 20 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తిరుపతిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. కావాలనే అడ్డుకున్నారని ఆరోపిస్తూ... శ్రీవిద్యానికేతన్ ఎదుటే రహదారిపై మోహన్‌బాబు బైఠాయించారు. Last Updated : Mar 22, 2019, 3:42 PM IST