ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల మెరుగు కోసం నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యాధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.
రెండ్రోజుల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి ఆళ్లనాని - ongole news
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య ఖాళీలను భర్తీ చేసేందుకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు మంత్రి ఆళ్ల నాని. ఉద్యోగుల పట్ల గౌరవం ఉంది కాబట్టే వైద్యురాలు అనితారాణి విషయంలో వెంటనే స్పందించి సీఐడీ విచారణకు ఆదేశించామన్నారు.
మంత్రి ఆళ్లనాని
చిత్తూరు వైద్యురాలు అనితారాణి అంశంపై సీఐడీ విచారణకు ఆదేశించామన్న ఆళ్ల నాని...ఉద్యోగుల పట్ల గౌరవం ఉంది కనుకే వెంటనే స్పందించామని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయని... దాదాపు 9,100 పోస్టులు భర్తీ చేసేందుకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
ఇవీ చదవండి:'అర్హులకు పథకాలు అందకపోతే.. పరిహారమివ్వాల్సిందే..!'
Last Updated : Jun 10, 2020, 11:35 AM IST