చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు మామిడి మార్కెట్కు కాయలను తీసుకొచ్చిన రైతులకు కన్నీరే మిగులుతోంది. ఆరుగాలం శ్రమించి, వేల రూపాయలు వెచ్చించి కోత కోసి మార్కెట్కు తీసుకువస్తే.. దళారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సరైన ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత్యంతరం లేక కొందరు రైతులు చెట్లపైనే కాయలను వదిలేస్తుంటే.. మరి కొందరు రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించి, ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
కరోనాతో మామిడి రైతు కుదేలు... గిట్టుబాటు ధర లేక పడేస్తున్న వైనం - mango farmers problems in chithore district
కరోనా మహమ్మారి కారణంగా చిత్తూరు జిల్లా మామిడి రైతులు కుదేలయ్యారు. గతంలో నష్టపోయిన రైతులకు ఈ సారీ కన్నీరే మిగిలింది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం, దళారులు ఇష్టారీతిన వ్యవహరించడం వంటి కారణాలతో... గత్యంతరం లేక కష్టపడి పండించిన పంటను అన్నదాతలు రోడ్డు పక్కన పడేస్తున్నారు
కరోనాతో మామిడి రైతు కుదేలు... గిట్టుబాటు ధర లేక పడేస్తున్న వైనం