ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మోసం చేసిన రాజకీయ పార్టీలను మాదిగల ఆవేదనను ఓటుతో చాటుతామని... మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన సమీక్షించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మాదిగలు ఉన్నారనే విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయానని ఆరోపించారు. మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎద్దేవా చేశారు. వర్గీకరణ డిమాండ్‌కి జాతీయ పార్టీ భాజపా, అధికార పార్టీ వైకాపా, ప్రధాన ప్రతిపక్షం తెదేపా మద్దతు ఇస్తూనే... పరిష్కారానికి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ... సంయుక్త అభ్యర్థి పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
తిరుపతి ఉపఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న మందకృష్ణ - ఎంపీలతో సమావేశం నిర్వహించిన మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకు మాదిగల ఆవేదనను ఓటుతో చాటుతామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నారనే విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయానని విమర్శించారు. వారికి బుద్ధి తెచ్చేందుకు వచ్చే ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
మాదిగల ఆవేదనను ఓటుతోనే చాటి చెబుతాం