జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో శనివారం ఆంధ్ర ప్రదేశ్ హార్టికల్చరల్ శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతుల సదస్సు జరిగింది. జిల్లాలో వర్షపాతం లేక అనేక గ్రామాల్లో నీటి సౌకర్యం లేదని, ఫలితంగా ప్రజలు, పశువులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు వేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా వర్షపాతం లేక జిల్లాలో మామిడి చెట్లు ఎండిపోతున్నాయని... సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మామిడి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - collector
జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా అన్నారు.
మామిడి రైతుల సదస్సు
Last Updated : Jun 15, 2019, 11:26 PM IST