నేటి నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో మద్యం ప్రియులు ఉదయాన్నే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే సంబంధిత శాఖ పెరిగిన మద్యం ధరలు ఖరారు చేయనందున దుకాణ సిబ్బంది అమ్మకాలు నిలిపేశారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచి గంటల తరబడి మద్యం ప్రియులు క్యూలైన్లో వేచి ఉన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురు చూస్తున్నారు.
మండుటెండలో మద్యం కోసం నిరీక్షణ
దాదాపు నెలన్నర అయ్యింది. రోజూ కొంచెమైనా అది గొంతులో పడందే ఉండలేదు ప్రాణం. అయినా సరే కరోనా భయంతో ఓపిక పట్టారు. లాక్ డౌన్‌ను గౌరవించారు. ఈరోజు నుంచి మళ్లీ వాటి అమ్మకాలు ప్రారంభం అనగానే.. మందు బాబు బయటికి వచ్చాడు. తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. నెలన్నరపాటు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన క్షణం వచ్చేసరికి ఆగలేకపోయారు. మండే ఎండనూ లెక్కచేయకుండా నుంచున్నారు. అయితే.. వారి నిరీక్షణ ఫలించలేదు. మద్యం ధరలు ఖరారు చేయకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు.
మండుటెండలో మద్యం కోసం నిరీక్షణ