భూ సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చింతలపాలెం, రామానుజపల్లె, వెంకటపాలెంకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి షికారీలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా భూములో సాగు చేయకుండా బీడు భూములు దర్శనం ఇస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాగుకు అనుమతివ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
భూ సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మండలంలోని చింతలపాలెం, రామానుజపల్లె, వెంకటపాలెంలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో ప్రస్తుతం సాగు చేసుకోనివ్వడం లేదని, అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాగుకు అనుమతివ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా