చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం గుడిపాడులో భాస్కర్‌శెట్టి అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాస్కర్‌కు రెండెకరాల పొలం ఉంది. సుమారు నాలుగు బోర్లు వేసి అప్పుల పాలయ్యాడు. చేసిన 5 లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో తెలియక తన వ్యవసాయం పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ప్రథమ చికిత్స అనంతరం చెన్నైకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
గుడిపాడులో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - గూడివాడలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కాలం మారుతున్నా రైతన్నల బతుకులు మారడం లేదు. నిత్యం అప్పుల ఊబిలో చిక్కుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాడులో అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి మృతి చెందాడు.
గూడివాడలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య