ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడు గ్రామంలో వేప చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... తమిళనాడులోని కానూరుకు చెందిన బాలగురు గోపీనాథ్(37) అనే వ్యక్తి ఒంగోలు గోపాల్నగర్లో నివాసముంటున్నారు. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో... మనస్తాపానికి గురైన గోపీనాథ్ తక్కెళ్లపాడు వద్ద ఉన్న పొలాల్లోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు.
ఇదీ చదవండీ: