తిరుమలలో వీఐపీ దర్శనం కోసం నకిలీ ఐపీఎస్ అధికారినంటూ మోసం చేసిన తెలంగాణ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో టెక్స్టైల్ సంస్థలో అధికారిగా పనిచేస్తోన్న అరుణ్ కుమార్ పాండ్ ప్రోటోకాల్ దర్శనానికి జేఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి తోడుగా ఐపీఎస్ అధికారినంటూ గుర్తింపు కార్డును జతచేశాడు. అనుమానం వచ్చిన తితిదే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా ప్రోటోకాల్ దర్శనం పొందడం కోసం నకిలీ గుర్తింపు కార్డును జతచేసినట్లు అంగీకరించాడు. సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
'ప్రోటోకాల్ దర్శనం కోసం ఐపీఎస్ అవతారం.. తెలంగాణ ఉద్యోగి అరెస్టు' - Fake_Ips_On_Break_Darshan_in thirupathi temple
తిరుమలలో వీఐపీ దర్శనం కోసం ఐపీఎస్ అధికారినంటూ ఓ తెలంగాణ ఉద్యోగి చేసిన మోసం బట్టబయలయ్యింది. నకిలీ గుర్తింపు కార్డును గుర్తించిన తితిదే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతిలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు