తిరుమల ప్రతిష్ఠ దిగజారే నిర్ణయాలే కాకుండా ఇప్పుడు ఏకంగా తితిదే వసతి గృహాలను ఎస్వీబీసీ ఛైర్మన్ తన రాస క్రీడలకు అడ్డాగా మార్చుకోవడం దారుణమని తితిదే మాజీ ఛైర్మన్ ఏవీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలని అపవిత్రం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తితిదే తీసుకుంటున్న నిర్ణయాల్లో మార్పు లేకపోతే భక్తకోటి ఆగ్రహానికి గురికాక తప్పదని ట్విట్టర్ వేదికగా ఆయన హెచ్చరించారు.
'చర్యలు తీసుకోకపోతే... భక్తకోటి ఆగ్రహానికి గురికాక తప్పదు' - ttd chairman prudviraj latest news updates
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశుడు కొలువైన తిరుమలలో అరాచక శక్తులు ప్రవేశించాయని తితిదే మాజీ ఛైర్మన్ ఏవీ రమణ ధ్వజమెత్తారు. ఒక కుట్ర ప్రకారం తిరుమలని అపవిత్రం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందని మండిపడ్డారు.
మాజీ తితిదే ఛైర్మన్ ఏవీ రమణ