చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లిలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. పొలాల్లోకి ఒకేసారి 15 ఏనుగులు రాగా... వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఒక ఏనుగు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో... ఏనుగులు పొలాల్లోకి చేరి పంట నాశనం చేస్తున్నాయని రైతులు వాపోయారు. అటవీ అధికారుల సహకారంతో బాణాసంచా కాల్చినప్పటకీ ఏనుగులు భయపడటం లేదని తెలిపారు. విద్యుత్ తీగలు పడిన విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టాలని కోరారు.
పొలంలోని విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి - elephant died sue to elecrical shock mogilavari palle
చిత్తూరు జిల్లా మొగిలివారిపల్లిలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. విద్యుత్ తీగలు పడిన విషయం పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.
పొలంలోని విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి
TAGGED:
విద్యుదాఘాతంతో ఏనుగు మృతి