ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో పనిచేస్తున్న వారిని తెలంగాణకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ... ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అధికారులకు తమ గోడు వెళ్లబోసుకోడానికి.. ఎస్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం... విధుల్లో చేర్చుకోవడానికి తెలంగాణ సర్కారు నిరాకరిస్తున్న కారణంగా తమ పరిస్థితి అగమ్యగోచరమైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల నుంచి కార్యాలయం ఎదుట నిరీక్షిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
వీళ్లు వదిలించుకున్నారు.. వాళ్లు వద్దంటున్నారు!
ఆంధ్రప్రదేశ్లోని ట్రాన్స్కో, జెన్కో సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌పీడీసీ కేంద్ర కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 525 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వారిని విధుల్లోకి చేర్చుకునేందుకు తెలంగాణ సర్కారు నిరాకరిస్తోంది. తమ పరిస్థితి అగమ్యగోచరమైందని ఏపీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
electricity-employees