తిరుపతి రుయా ఆస్పత్రిలో అక్సిజన్ అందక కరోనా బాధితులు చనిపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని సీపీఐ నారాయణ అన్నారు. దాదాపు 26 మంది రోగులు చనిపోతే కేవలం 11 మంది చనిపోయినట్లు తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరా కాలేదని అధికారులు చెప్పటం అబద్దమన్నారు.
దాదాపు 45 నిమిషాల పాటు అక్సిజన్ అందకపోతేనే చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న తనను నగరి పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల పరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడాలన్నారు.