ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయా ఆస్పత్రిలో 'కరోనా' బాధితుల కోసం ప్రత్యేక వార్డు

ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రాయలసీమలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి రుయాలో... కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స నిమిత్తం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకూ ఒక్కకేసూ నమోదు కాలేదని రుయా అధికారులు చెప్పారు. మొత్తం 8 పడకలతో ఏర్పాటు చేసిన ఈ ఐసీయూ వార్డులో చేరిన రోగుల నుంచి నమూనాలను సేకరించి... పుణెలో పరీక్షలు చేయించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Corona Virus Precautions in ruya hospital
రుయా ఆస్పుత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డు

By

Published : Jan 28, 2020, 7:01 PM IST

.

రుయా ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక వార్డు

ABOUT THE AUTHOR

...view details