అధ్యాత్మికతలో విశేష కృషి చేసిన ముంతాజ్ అలీ అలియాస్ శ్రీ ఎం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళకు చెందిన ముంతాజ్ అలీకి చిత్తూరు జిల్లా మదనపల్లెతో విడదీయరాని బంధం ఉంది. 1996వ సంవత్సరంలో మదనపల్లె కేంద్రంగా సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ...పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అంతేగాకుండా మదనపల్లె రిషీ వ్యాలీ పాఠశాల ట్రస్టు సభ్యుడిగా ఉన్నారు. తాను స్థాపించిన పాఠశాలలో యోగాను నేర్పించేందుకు 'భారత్ యోగా విద్యా కేంద్రాన్ని' స్థాపించారు. ఇందులో ప్రతిరోజూ విద్యార్థులకు యోగా, అధ్యాత్మిక బోధనపై పాఠాలు చెబుతుంటారు. దేశ, విదేశాల్లో యోగా, అధ్యాత్మికతపై అనేక సదస్సులో ముంతాజ్ అలీ పాల్గొన్నారు. యోగాకు సంబంధించి పలు భాషాల్లో 10 కి పైగా పుస్తకాలు రచించారు.
మదనపల్లె వాసిగానే చెప్పొచ్చు: ముంతాజ్ అలీ
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ముంతాజ్ అలీని ఈటీవీ భారత్ పలకరించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 35 ఏళ్లుగా మదనపల్లె కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాని తెలిపారు. తనని మదనపల్లె వాసిగానే చెప్పొచ్చని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యోగాపై శిక్షణ ఇస్తున్నాని వెల్లడించారు.
ఇదీ చదవండి : సెలెక్ట్ కమిటీ.. సభ్యుల పేర్లు పంపాలని ఛైర్మన్ లేఖ