చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. జిల్లాలో కొత్తగా బుధవారం 6 పాజిటివ్ కేసులు నమోదుకాగా... ఆ కేసులన్నీ శ్రీకాళహస్తికి చెందిన వారే కావడం గమనార్హం. దీంతో ఒక్క శ్రీకాళహస్తిలోనే 40పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి... అధికారులు పారిశుద్ధ్యం పనులను ముమ్మరం చేశారు. చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా... శ్రీకాళహస్తిలోని రెడ్జోన్లలో పర్యటించి క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకూ నలుగురు డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 55గా ఉందని ఆయన తెలిపారు.
తిరుపతి ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రి నుంచి వైద్యులు 10 మందిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. వారంతా 28రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా రంజాన్ మాసంలో బహిరంగ ప్రార్థనలను నిర్వహించరాదని మతపెద్దలకు కలెక్టర్ సూచించారు.