చిత్తూరు జిల్లా పుత్తూరులో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అకస్మికంగా పర్యటించారు. ఇక్కడ 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రత, లాక్డౌన్ అమలు తదితర అంశాలను పరిశీలించేందుకు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. 28 రోజుల వరకు పాజిటివ్ కేసు నమోదు కాకపోతే రెడ్‌జోన్ తీసేస్తామని చెప్పారు. అప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రజలు బయటకు రావొద్దని.. వారికి కావలసిన నిత్యావసరాలు ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తామని వెల్లడించారు.
'రెడ్‌జోన్ ప్రాంతంలో ప్రజలు బయటకు రావొద్దు'
రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో ప్రజలు బయటకు రావొద్దని.. నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే చేర్చే ఏర్పాటు చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. పుత్తూరులో అకస్మిక పర్యటించిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పుత్తూరులో చిత్తూరు ఎస్పీ పర్యటన