ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే ఆ వ్యక్తులు వెంటనే క్వారంటైన్ కేంద్రంలో చేరి వైరస్ వ్యాప్తి నివారణకు సహకరించాలని.. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కోరారు. శ్రీకాళహస్తి క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పట్టణంలో ఒకే రోజు 5 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనందున దిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రంలో ఉండాలని కోరారు. వారిని వికృతమాల క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
'కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే క్వారంటైన్లో ఉండండి' - శ్రీకాళహస్తి క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన చిత్తూరు కలెక్టర్ తాజా వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్వారంటైన్ కేంద్రాన్ని కలెక్టర్ భరత్ గుప్తా సందర్శించారు. దిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రంలో చేర్చారు.
శ్రీకాళహస్తి క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ భరత్ గుప్తా