చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 19న నియోజక వర్గంలోని 5చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈవీఎం, వీవీ ప్యాట్లను బరిలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో... కమిషనింగ్, ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టినట్లు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మహేష్ కుమార్ పేర్కొన్నారు.
చంద్రగిరిలో రీపోలింగ్‌కు చురుగ్గా ఏర్పాట్లు
చంద్రగిరిలో ఈ నెల 19న జరగనున్న రీపోలింగ్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తిరపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు.
'చంద్రగిరి రీపోలింగ్‌కు చురుగ్గా ఏర్పాట్లు'