ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ సమాధానం చెప్పు.. నీకో రూలు.. నాకో రూలా..?: చంద్రబాబు

CBN PROTEST ON ROAD: కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో చంద్రబాబు పర్యటన మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. గుడిపల్లిలో పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు చంద్రబాబు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన బాబు.. రోడ్డుపై కాసేపు బైఠాయించారు. ఐనా.. పోలీసులు దారివ్వకపోవడంతో.. చంద్రబాబు తన బస్సు పైకి ఎక్కి ప్రసంగించారు.

CBN PROTEST ON ROAD
CBN PROTEST ON ROAD

By

Published : Jan 6, 2023, 3:34 PM IST

Updated : Jan 6, 2023, 4:14 PM IST

CBN FIRES ON JAGAN : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానిక బస్టాండ్‌ సమీపంలో రోడ్డుపైనే ఆయన బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడమేంటని మండిపడ్డారు.

పోలీసులు బానిసలుగా బతకొద్దు..:‘‘పోలీసులూ.. ఏంటీ బానిసత్వం. మీరు బానిసలుగా బతకొద్దు. చట్టప్రకారం మీ విధులు నిర్వర్తించండి. ఇక్కడినుంచి నన్ను తిరిగి పంపాలని చూస్తున్నారు.. కానీ నేను వెళ్లను. మిమ్మల్నే ఇక్కడి నుంచి పంపిస్తా. మిమ్మల్నే కాదు.. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతా. నా గొంతు 5 కోట్ల మంది ప్రజలది. ఆ విషయాన్ని జగన్‌ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదు.

నేను ప్రశ్నిస్తుంటే పోలీసు అధికారులు పారిపోతారా? సంబంధిత అధికారికి సిగ్గులేదా? చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రజలు తిరగబడితే ఏం చేయగలరు? పోలీసులు ఎక్కడుంటారు.. మీరు ఆకాశంలో తిరగాల్సి ఉంటుంది. ఎన్ని జైళ్లు, పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ప్రజలను వాటిలో పెట్టగలరు? జీవో నంబర్‌ 1 చట్టవిరుద్ధమైనది. రాజమహేంద్రవరంలో సీఎం జగన్‌ మీటింగ్‌ పెట్టలేదా? రోడ్‌షో చేయలేదా? మీ పార్టీ నేతలు రోడ్డు షోలు నిర్వహించలేదా? జగన్‌.. సమాధానం చెప్పండి. నీకో రూలు.. నాకో రూలా? పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారంతా దోషులే’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.

జగన్​ సమాధానం చెప్పు.. నీకో రూలు.. నాకో రూలా..?

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details