ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో 5939కు చేరిన కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 271 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. దీంతో కొవిడ్ కేసుల సంఖ్య 5939కు చేరింది. కేసులు పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమై లాక్ డౌన్ విధించారు.

chittor district
చిత్తూరు జిల్లాలో 5939కు చేరిన కరోనా కేసులు సంఖ్య

By

Published : Jul 23, 2020, 10:52 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు జిల్లాలో వైరస్ వ్యాప్తిని స్పష్టం చేస్తున్నాయి. గురువారం జిల్లాలో 271 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 5939 కి చేరుకుంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 67కి చేరుకుంది.

కేసులు అధికంగా ఒక్క తిరుపతిలోనే నమోదవుతున్నాయి. దీంతో అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. రోడ్ల పైకి వాహనాలను, ప్రజలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్ కి మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో 3442 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 2430 యాక్టివ్ కేసులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండిమంత్రి పెద్దిరెడ్డిపై జూనియర్ సివిల్ జడ్జి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details