చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజున హంస, చిలక వాహనాలపై సోమస్కంధ మూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబ దేవి భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణ వాహనాలపై కొలువుదీరిన ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగారు. కోలాటాలు, నృత్యాల నడుమ జరిగిన ఈ సంబరాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రికి శేష, యాలి వాహనాలపై ఆది దంపతులు దర్శనమివ్వనున్నారు.
హంస, చిలుక వాహనాలపై ఆదిదంపతుల దర్శనం - srikalahasti updates
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. హంస, చిలుక వాహనాలపై ఆదిదంపతులు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హంస, చిలుక వాహనం