చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివరామపురంలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. మొత్తం 13 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుగులో బాంబులు దొరికిన ఘటన మరువక మునుపే మళ్లీ బాంబులు బయట పడటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
శివరామపురంలో 13 బాంబులు స్వాధీనం - chittoor
నాటుబాంబులు మరోసారి దొరకటం కలకలం రేపుతోంది. కొన్నిరోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుగు ఘటన మరువక ముందే.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 13 నాటుబాంబులు లభ్యమయ్యాయి.
నాటుబాంబులు