ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లైవ్​ వీడియో: విలేకరి ఇంటి ముందు వీరంగం సృష్టించిన వ్యక్తి - attack on journalist house in chittoor dst

అనుకూలంగా వార్త రాయలేదని ఆరాచకం సృష్టించాడు ఓ వ్యక్తి. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో విలేకరి ఇంటిపైకి దాడికి దిగాడు. ఇంటి ముందున్న సామాన్లన్నీ బయటపడేసి ధ్వంసంచేశాడు.

attack on reporter house in chittoor dst kanduru
attack on reporter house in chittoor dst kanduru

By

Published : Aug 31, 2020, 2:33 PM IST

లైవ్​ వీడియో: విలేఖరి ఇంటిముందు వీరంగం సృష్టించిన వ్యక్తి

తమకు అనుకూలంగా వార్త రాయలేదని... గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన ఓ విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరి సొంతూరు కందూరులో పలువురు యువకులు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు వేసి ధ్వంసం చేశారు. ఈ విషయంపై బాధిత విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుకూలంగా వార్త రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడిచేసి, చంపేస్తామని బెదిరించారని తన పిర్యాదులో పేర్కొన్నారు. యువకులు దాడి చేస్తున్న సమయంలో దృశ్యాలను రికార్డ్ చేసిన విలేకరి... వాటిని పోలీసులకు చూపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details