చిత్తూరు జిల్లాలో ప్రతి రెండు గంటలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లెవల్స్ పై సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కి అందించాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఆక్సిజన్ మేనేజ్మెంట్ గురించి ఆయన జిల్లాస్థాయి ఉన్నత అధికారులతో చర్చించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, జేసీ వీరబ్రహ్మం తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మదనపల్లి, చిత్తూరు డివిజన్ ఆసుపత్రులలో కనీసం 9 గంటలకు సరిపడా నిల్వ వుండాలని కలెక్టర్ అన్నారు. లిక్విడ్ గ్యాస్ విషయంలో 12 గంటకు సరిపడా ఉండాలని ఆదేశించిన కలెక్టర్.. ఆక్సిజన్ నోడల్ అధికారులు బాధ్యతతో ప్రాణాలు పోకుండా కాపాడాలని కోరారు.
'ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లెవల్స్‌పై రెండు గంటలకు ఒకసారి సమాచారం ఇవ్వాలి'
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పై రెండు గంటలకు ఒకసారి కంట్రోల్ రూమ్‌కి అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ ఆసుపత్రులలో కనీసం 9 గంటలకు సరిపడా నిల్వ ఉండాలని, లిక్విడ్ గ్యాస్ విషయంలో 12 గంటకు సరిపడా ఉండాలని తెలిపారు.
collector review