చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్స్లీహిల్స్లో మొదటిసారి అడ్వెంచర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈనెల 17 నుంచి 20 వరకు సాహస క్రీడా పోటీలు జరగనున్నాయి. సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తులో.. కొండలు, కోనలు, గుట్టలతో నిండి ఉన్న ఆంధ్రా ఊటీలో.. ఈ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సాహస క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించవచ్చని అధికారులు తెలిపారు. బెంగళూరు, చెన్నై, మహా నగరాలతోపాటు, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి రవాణా సదుపాయాన్ని కల్పించారు. సాహస క్రీడాకారులకు, పర్యటకులకు ఫెస్టివల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి భోజన వసతులు, ఇతర వసతి సదుపాయాలను కల్పించనున్నారు. రాష్ట్ర పర్యటక శాఖ, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
రేపటి నుంచి ఆంధ్రా ఊటీలో అడ్వెంచర్ ఫెస్టివల్ - హార్సిలీ హిల్స్ తాజా న్యూస్
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం హార్స్లీహిల్స్లో..రేపటి నుంచి 20వ తేదీ వరకు సాహస క్రీడల పోటీలు నిర్వహించనున్నారు. హాజరయ్యే వారి కోసం రవాణా సదుపాయాలను కల్పించారు.
ఈనెల 17 నుంచి ఆంధ్రా ఊటీలో అడ్వెంచర్ ఫెస్టివల్