ETV Bharat / state

ఆంధ్రాఊటీలో మంచు అందాల విందు..! - విశాఖ మన్యంలో లంబసింగిని మించిన అందాలు

వయ్యారాల వన్నెల ప్రకృతి... మంచు చీర కట్టుకొని మనోహరంగా ముస్తాబవుతుంది. పచ్చదనాన్ని పరుచుకున్న ఎత్తైన కొండలు... ఆ అందాలను తనలో కలుపుకున్న మంచు సోయగాలు పర్యటకులను పరవశింపజేస్తున్నాయి. ఆ సుమనోహర ఆంధ్రాఊటీ అందాలను ఓసారి తిలకించి పులకిద్దామా..!

ఆంధ్ర ఊటీలో మంచు అందాల విందు
ఆంధ్ర ఊటీలో మంచు అందాల విందు
author img

By

Published : Dec 1, 2019, 7:44 PM IST

ఆంధ్రాఊటీలో మంచు అందాల విందు..!

మంచుకు కంచె కట్టారా..? అన్నట్టు చెరువులవేనం అందాలు పర్యటకులకు కనువిందు చేస్తున్నాయి. మంచుతో కప్పబడిన కొండకోనలు కైలాసాన్ని తలపిస్తున్నాయి. మంచుతో నిండిన అందాలు చూసేందుకే సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు తరలివస్తారు. ఏడాది పొడువునా పచ్చని అందాలతో కనువిందు చేసే విశాఖ మన్యాన్ని ఆంధ్రాఊటీగా పిలుస్తారు. విశాఖ మన్యంలో లంబసింగిని మించిన అందాలను తనలో నింపుకొని... పర్యటకుల దృష్టిని ఆకర్షిస్తోంది చెరువువేనం.

లంబసింగి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై ఉన్న ఈ ప్రాంతం... పర్యటకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇక్కడికి చేరుకునేందుకు రహదారి లేకపోయినా... మంచు అందాలను చూసేందుకు పర్యటకులు వస్తున్నారు. కొండకోనల్లో కాలినడకన చెరువులవేనం చేరుకున్న ప్రకృతి ప్రేమికులకు... సముద్ర తీరాన్ని తలపించే అందాలు దర్శనమిస్తున్నాయి.

ఇవీ చూడండి...'అడవి కాల్చేయమని డబ్బులిచ్చిన ప్రముఖ హీరో!'

Intro:AP_VSP_56_01_ANDHRA KASHMIR LO POTETTINA PARYATAKULU_AV_AP10153Body:మంచుకు కంచె కట్టారా?.... అన్న విధంగా చెరువుల వేనం అందాలు ఆదివారం పర్యటకులకు కనువిందు చేశాయి.. మన్యంలో గిరిజనులు తమ పంటపొలాలలకు రక్షణగా కంచెలను నిర్మిస్తారు. అలానే ఈ ప్రాంతంలో కురిసే మంచు బయటకు పోకుండా చెరువుల వేనం వద్ద మంచుకు కంచె కట్టిన విధంగా ఉందని పర్యటకులు ఆనందోత్సవాలుతో సందడి చేశారు. ఆంధ్రా కశ్మీరుగా విశాఖ మన్యంలో ని లంబసింగి కి పేరుంది. ఏడాది పొడవునా శీతల వాతావరణంతో నిండి ఉండే ఈ ప్రాంతం సముద్ర మొత్తానికి సుమారు 3600 ఎత్తులో ఉంది. దశాబ్ద కాలంగా కేవలం ఇక్కడ మంచు తో నిడివుండే అందాలను చూసేందుకే దూర ప్రాంతా లనుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇప్పుడు లంబసింగి ని మించిన అందాల ను తనలో నింపుకొని పర్యాటకుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది చెరువులవవెనంజ లంబసింగి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన కొండపై ఏ గ్రామం ఉంది. ఇక్కడ ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మూడేళ్ళుగా ఇక్కడ కొండపై మంచు అందాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. కనీస రహదారి లేక పోయినా కొండపై ఉన్న మంచు అందాలను చూసేందుకు దూర ప్రాంతాలకు చెందిన వారు వస్తూన్నారు. గిరిజనుల పంట పొలాలను అనుకుని మంచు సముద్ర తీరంలా కనిపిస్తుంది ఈ అందాలను చూడటానికి ముఖ్యంగా శీతల కాలంలో అధికసంఖ్యలో పర్యటకులు తరలివస్తుంటారు. చెరువుల వేనం చేరుకోవడం కష్టమైనా పర్యటకులు మాత్రం సాహసం చేసి ఇక్కడకు చేరుకుని మంచు అందాలను ఆస్వాదిస్తుంటారు. ఆంద్రా కశ్మీర్‌గా పేరుగాంచిన విశాఖ మన్యంలోని లంబసింగి కి పక్కనే ఉన్న చెరువుల వేనంలో ఆదివారం పర్యటకులు అదికసంఖ్యలో సందడిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండకోనల్లో కాలినడకన చెరువుల వేనం చేరుకున్న పర్యటకులు తమ పడ్డ కష్టాన్ని మరిచిపోయి అంతక మంచి ఆనందాన్ని పొందారు. ఈసందర్భంగా పర్యటకుల మధురానుభూతితో ఆ ప్రాంతం ముసుగేసింది. మంచు దట్టంగా కురవడంతో పర్యటకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తెల్లవారుజామునే లంబసింగి చేరుకున్న పర్యటకుల వాహనాలు లంబసిండి నుంచి తాజంగి జలాశయం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రహదారి కిటకిటలాడింది. వాహనాలను లంబసింగిలో ఉంచి అక్కడ నుంచి చెరువుల వేనం కాలినడకన చేరుకున్నారు. వారంతం కావడంతో పర్యటకకేంద్రాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ ప్రాంత అందాలను తిలకించేందుకు వచ్చిన వారితో ఆయా ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. దట్టంగా కురుస్తున్న మంచులో చలికి వణుకుతూ వలిసెపూల తోటల్లో ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు. లంబసింగి, చెరువుల వేనం సందర్శించిన వారంతా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి చేరకున్నారు.Conclusion:M Ramanarao,9440715742
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.