అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. విద్యా వ్యవస్థ సమూల మార్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
'ఏటా డీఎస్సీతో ఉద్యోగాల భర్తీ'
అమ్మఒడి పథకంతో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
విద్యా శాఖ అధికారులతో సమీక్ష