చిత్తూరు జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ అన్నంగి దళితవాడకు చెందిన ఓ విద్యార్థి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన అరుణ, వెంకటరమణ దంపతుల కుమారుడు సాయి నరసింహ స్థానిక శివరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు కావటంతో ఇంటి దగ్గరే ఉన్నాడు. వీధిలో ఆడుకుంటూ తాగునీటిని సరఫరా చేసే ట్యాంకర్‌పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి జారి కింద పడటంతో వాహనం వెనుక చక్రం బాలుడిపై దూసుకెళ్లింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ని స్థానికులు చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి - పీలేరు మండలంలో విద్యార్థి మృతి
చిత్తూరు జిల్లాలోని దొడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. తమ బిడ్డ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
A student died in an accident