తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. రామ్‌నగర్‌లో హారతి అనే యువతిని ఆమె ప్రియుడు షాహిద్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. కాజీపేటకు చెందిన షాహిద్ రామ్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. లష్కర్ సింగారానికి చెందిన హారతి అనే యువతి అతని గదికి రాగా ఇద్దరి మధ్యలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి షాహిద్ ఆమెను గొంతు కోసి పరారయ్యాడు.
ప్రేమ వ్యవహారమే కారణం
సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ రవీందర్ ఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడు షాహిద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ప్రేమ వ్యవహరమే దీనికి కారణమని తెలిపారు. నిందితుడు ఓ మటన్ షాపులో పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి:
ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు