చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన ఓ బాలిక.. అదే కాలనీకి చెందిన యువకుడు భరత్తో స్నేహం పెంచుకుంది. ఆ యువకుడితో ప్రేమ పేరుతో తిరుగుతునట్లు భావించిన తల్లిదండ్రులు బాలికను మందలించారు. దీన్ని అవమానంగా భావించిన ఆమె పురుగుల మందు తాగిందని తల్లిదండ్రులు తెలిపారు.
చికిత్స పొందుతూ...మృతి
అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోకి ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయమై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పెనుమూరు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
పలమనేరులో ప్రాణం తీసిన సెల్ఫీ సరదా