ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో జాడలేని 108 వాహనాలు.. అవన్నీ ఎక్కడున్నాయంటే..!

గత కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో 108 అంబులెన్స్ వాహనాలు కనిపించకుండా పోయాయి. మరోవైపు.. ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో ఏకంగా 18 అంబులెన్స్ (108) లు కనిపించాయి. అసలు ఇవన్నీ అక్కడెందుకు ఉన్నాయన్నదే ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

చంద్రగిరిలో కనిపించని 108 వాహనాల జాడ.. అవన్నీ ఎక్కడున్నాయంటే..!
చంద్రగిరిలో కనిపించని 108 వాహనాల జాడ.. అవన్నీ ఎక్కడున్నాయంటే..!

By

Published : Dec 29, 2020, 1:17 PM IST

అనారోగ్య సమస్య వస్తే.. 108 వాహనానికి ఫోన్ చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటారు. కానీ.. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండంలో గత కొన్ని రోజులుగా వీటి జాడ లేకుండా పోయింది. ఈ మండల పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రమాదంతో రోడ్లు రక్త మోడుతూనే ఉంటాయి.

పూతల పట్టు - నాయుడుపేట, తిరుపతి - అనంతపురం జాతీయ రహదారుల పై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అలాంటి చోట 108 వాహనం కనిపించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... చంద్రగిరి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో సుమారు పద్దెనిమిది... 108 వాహనాలు కనిపించాయి. పాత వాహనాలకు కొత్త స్టిక్కర్లు అంటించి రహస్యంగా ప్రహరీ గోడ మధ్యలో వీటిని దాచేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఎవరు చేస్తున్నారో అని.. స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details