ఈసీ పక్షపాత వైఖరి అవలంబిస్తోంది: రాజేంద్రప్రసాద్
ఈసీ తీరుపై తెదేపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సంఘం ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారిందని, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మోదీ, కేసీఆర్, జగన్‌లకు లబ్ధి చేకూరేలా ఈసీ వ్యవహారిస్తోందని అన్నారు. ఐటీ నిపుణుడు హరిప్రసాద్ తో మాట్లాడమంటే ఆయన పై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతుందని.. అలాంటప్పుడు క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్రానికి సీఎస్‌గా ఎలా నియమంచారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.