ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అమరావతిలో భేటీ అయ్యారు. మంగళవారం నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకుంటే... సమావేశ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవలన్న అంశంపై చర్చించారు. కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి ఇంకా అనుమతిరాలేదని చంద్రబాబుకు సీఎస్ స్పష్టం చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి ఈసీ అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నాం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా... కరువు, ఫొని తుపాన్, తాగునీటి సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సీఎస్తో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.
కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి రాకపోతే ఏం చేద్దాం? - cabinate meeting
మంత్రమండలి సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం