గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా లక్షా80వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.భారీగా పోస్టులు భర్తీ కానుండటంతో....ఇప్పటికే నిరుద్యోగులు ప్రయత్నాలు ప్రారంభించారు.అయితే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా....నియామక ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు.
ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం-సిలబస్‌పై తర్జనభర్జన
గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ వారంలోనే రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 2 నాటికి గ్రామసచివాలయాల ద్వారా కార్యకలాపాలు ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి6నెలల సమయం ఉంటుంది..కానీ గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలు..అక్టోబర్2లోపు పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో నియామక ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఉద్యోగాల వారీగా సిలబస్ సహా నియామక ప్రక్రియపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో....ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.సమయం తక్కువగా ఉండటం,సిలబస్ తెలియకపోవడంతో సన్నద్ధతపై ఉక్కిరిబిక్కిరవుతున్నారు.పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు గతంలో ఉన్న సిలబస్‌నే ఉంచుతారా లేక,కొత్తది రూపొందిస్తారా అన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు.వీఆర్వో పోస్టులదీ అదే పరిస్థితి.పూర్తి వివరాలతో కూడిన ప్రభుత్వ ప్రకటన వస్తే తప్ప...అభ్యర్థుల్లో అయోమయం తొలిగే పరిస్థితి కనిపించడం లేదు.